Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు బిగ్ రిలీఫ్.. తొలిసారి !
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:31 PM
కొందరిని కొన్ని విషయాల్లో దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే అలాంటి వాటిని ఓవర్ కమ్ చేసి..ఫస్ట్ టైమ్ విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుంటాది. అలాంటి ఘటనే టీమిండియా యంగ్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ విషయంలో జరిగింది.
కొందరిని కొన్ని విషయాల్లో దురదృష్టం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే అలాంటి వాటిని ఓవర్ కమ్ చేసి..ఫస్ట్ టైమ్ విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుంటాది. అలాంటి ఘటనే టీమిండియా యంగ్ ప్లేయర్, టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ విషయంలో జరిగింది. టెస్టు కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం బిగ్ రిలీఫ్ వచ్చింది. అది కూడా టాస్ నెగ్గే విషయంలో కావడం విశేషం. మరి..అసలు సంగతి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గత జూన్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తన తొలి టెస్టు సిరీస్‌నే డ్రాగా ముగించాడు. అంతేకాక ఆ సిరీస్ లో టాప్ స్కోరర్‌గా గిల్ నిలిచాడు. ఇప్పుడు మళ్లీ వెస్టిండీస్‌తో(IND vs WI 2025) టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరుగుతున్న రెండో మ్యాచ్‌తో కలిపి ఏడు టెస్టులకు గిల్ నాయకత్వం వహించినట్లు అవుతుంది. ఈక్రమంలో తనపై ఇప్పటివరకూ ఉన్న ‘టాస్’ ఓడే భారాన్ని ఈ మ్యాచ్ తో దించేసుకున్నాడు.
టెస్టు కెప్టెన్ గా గత ఆరు మ్యాచుల్లోనూ గిల్(Shubman Gill) టాస్ ఓడాడు. అయితే ఎట్టకేలకు తన నాయకత్వంలోని ఏడో టెస్టులో శుక్రవారం టాస్(Toss) గెలిచాడు. దీంతో అతడిని సహచర ప్లేయర్లు ఆట పట్టించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, పేసర్ బుమ్రా(Jasprit Bumrah), అక్షర్ పటేల్ తదితరులు గిల్‌ను మ్యాచ్ విజయం సాధించినట్లు అభినందించారు. మరోవైపు టాస్ నెగ్గిన గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో బరిలోకి దిగిన జట్టుతోనే భారత్ ఈసారి ఆడుతోంది.