Rohit Sharma Scolds Security: అభిమాని కోసం.. సెక్యూరిటీపై రోహిత్ ఫైర్!
ABN , Publish Date - Oct 12 , 2025 | 10:43 AM
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్నారు. ముంబైలోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు.
సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారికి అభిమానులు ఉంటారు. సెలబ్రిటీలను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఫ్యాన్స్ పై సెక్యూరిటీ సిబ్బంది దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఈక్రమంలో తమ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కొందరు ప్రముఖులు సీరియస్ అవుతుంటారు. మరికొందరు అయితే సెక్యూరిటీ సిబ్బందికి వార్నింగ్ కూడా ఇస్తుంటారు. అలానే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అభిమాని కోసం సెక్యూరిటీ ఫైర్ అయ్యాడు. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఆస్ట్రేలియాతో(Australia) మూడు వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ(Rohit Sharma ) సన్నదమవుతున్నారు. ముంబై(Mumbai)లోని శివాజీ పార్క్ స్టేడియంలో రోహిత్ కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. టీమిండియా(Inidia) మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో రోహిత్.. గంటల కొద్దీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముఖ్యంగా భారీ షాట్స్ ఆడటంపై ఫోకస్ పెట్టాడు. శుక్రవారం ప్రాక్టీస్ లో భాగంగా అతను కొట్టిన ఓ సిక్సర్ నేరుగా రోహిత్ లాంబోర్గినీ కారు అద్దాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు రోహిత్ శర్మ(Rohit Sharma) ప్రాక్టీస్‌ను చూసేందుకు ఆయన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఈ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ ను చూసేందుకు ఓ చిన్నారి అభిమాని అతనిపై వస్తుంది. ఈ క్రమంలో ఆ చిన్నారిని సెక్యూరిటీ అడ్డుకుంది. ఆ చిన్నారితో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడమే కాకుండా కాస్త దురుసుగానే ప్రవర్తించారు. ఈ విషయాన్ని గమనించిన రోహిత్.. సెక్యూరిటీపై గట్టిగా అరుస్తూ... ఆ చిన్నారిని తన వద్దకు పంపించాలని సూచించాడు. అభిమానుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతూ వారిని మందలించాడు. చివరకు రోహిత్ సెల్ఫీ ఇవ్వడంతో ఆ చిన్నారి సంబరపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా అవుతోంది.
ఇవి కూడా చదవండి
India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో
Womens World Cup: కంగారూలతో కఠిన పరీక్షే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి