Rohit Sharma record: కోహ్లీ, సచిన్‌కు కూడా సాధ్యం కానిది.. సంచలన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..
ABN , Publish Date - Oct 16 , 2025 | 05:01 PM
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగబోతున్నాడు.
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నాడు. ఇప్పటికే టీ-20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ టీమిండియా తరఫున వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగబోతున్నాడు. టీమిండియాకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహించబోతున్నాడు. తాజా సిరీస్‌లో బ్యాటర్‌గానే బరిలోకి దిగుతున్న రోహిత్ పలు రికార్డులు బద్దలుకొట్టబోతున్నాడు (Rohit Sharma record Australia).
ఆస్ట్రేలియాలో అరుదైన రికార్డు సృష్టించేందుకు రోహిత్ శర్మ మరో పది పరుగుల దూరంలో ఉన్నాడు. తాజా సిరీస్‌లో మరో పది పరుగులు చేస్తే రోహిత్ శర్మ మరే భారత బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. రోహిత్ మరో పది పరుగులు చేస్తే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 19 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 58.23 సగటుతో 990 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరో పది పరుగులు చేస్తే వెయ్యి రన్స్ పూర్తి చేసుకుంటాడు (1000 runs in Australia).
రోహిత్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ (802 పరుగులు), సచిన్ టెండూల్కర్ (740 పరుగులు), ధోనీ (684 పరుగులు), శిఖర్ ధవన్ (517 పరుగులు) ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేలో రోహిత్ శర్మ మరో వ్యక్తిగత మైలురాయిని చేరుకుంటాడు. ఇది రోహిత్ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ అవుతుంది (Rohit 500th match). రోహిత్ కంటే ముందు సచిన్ (664), కోహ్లీ (550), ధోనీ (535), రాహుల్ ద్రవిడ్ (504) మాత్రమే టీమిండియా తరఫున 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.
ఇవి కూడా చదవండి
Commonwealth Games 2030: అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ క్రీడలు
India Team Departs for Australia: ఆసీస్‌కు పయనం
Williamson Joins LSG : IPL 2026లో కొత్తగా కనిపించనున్న కేన్ మామ!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి