Home » Road Accident
రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బైక్ వెనకసీటుపై కూర్చొన్న వ్యక్తికి కూడా పరిహారం పొందే అర్హత ఉందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులను బలితీసుకుంది. రోడ్డుపక్కన నిలిచి ఉన్న లారీని స్విఫ్ట్ కారు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు..
హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ప్రమాదవశాత్తూ లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ఏడాది వయసున్న చిన్నారి ఉండటం స్థానికుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.
జమ్మూకశ్మీర్ గందర్‌బల్ జిల్లాలో ఇవాళ (మంగళవారం) ఉదయం అమర్‌నాథ్ యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తూ బస్సు అదుపుతప్పి ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు గాయపడ్డారు.
కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం బొమ్మలూరు జాతీయ రహదారిపై టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ సురేశ్ మృతి చెందారు.
జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం, కారు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి-పుప్పాలగూడ టోల్‌గేట్ వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ క్రషర్ నగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి సరుకును అన్‌లోడ్ చేస్తున్న కళాసిలను రెడీమిక్స్ కాంక్రీట్ (RMC) లారీ ఢీకొట్టింది.