Road Accident: రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకులు దుర్మరణం
ABN , Publish Date - Jan 07 , 2026 | 08:47 PM
కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు కన్నుమూయడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కర్నూలు జిల్లా, జనవరి 07: జిల్లాలోని కౌతాళం మండలం ఎరిగేరి సమీపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎరిగెరి గ్రామంలో శ్రీ బంగారమ్మ అవ్వ మహోత్సవానికి వెళ్లారు తల్లీకొడుకు మహాదేవి, నాగిరెడ్డి. దేవర సందర్భంగా మొక్కులు తీర్చుకొని తిరిగి కౌతాళంకి బయలుదేరారు. అమ్మవారి దర్శనం తర్వాత ఎంతో సంతోషంగా వెళ్తున్నవాహనాన్ని ఆటో రూపంలో మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న బైక్‌ని.. ఆటో ఢీ కొట్టడంతో ఎగిరి అవతల పడ్డారు.
ప్రమాదంలో తల్లీ, కొడుకు తీవ్రంగా గాయపడటంతో కన్నుమూశారు. దైవ దర్శనానికి వెళ్లిన తల్లీకొడుకులు కన్నుమూయడంతో గ్రామంలో తీవ్ర విషాదంలో నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమే కానీ..: కేటీఆర్
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష