Travels Bus Catches Fire: ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో..
ABN , Publish Date - Jan 07 , 2026 | 06:29 AM
కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళ్తోంది. ఈ నేపథ్యంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు మొత్తం దగ్ధం అయింది. బుధవారం తెల్లవారుజామున కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళుతూ ఉంది. ఈ నేపథ్యంలో సెల్ఫ్ మోటార్ షార్ట్‌సర్క్యూట్‌కు గురైంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్ని గుర్తించిన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు.
బస్సును వెంటనే నిలిపివేశాడు. ఆయన అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులను వేరే బస్సులో అక్కడినుంచి తరలించారు.
ఇవి కూడా చదవండి
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..