Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ఎదురుగా వస్తున్న కారుని ఢీకొని..
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:58 PM
ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. సోంపేట మండలం బారువ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. లారీ, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో చికిత్సపొందుతూ ఆ ఇద్దరూ మృతిచెందారు. మృతులు ఒడిశా వాసులుగా తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Bhogapuram Airport: ఎయిర్ పోర్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంపీ కలిశెట్టి
CM Chandrababu: కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ కలిగింది: సీఎం చంద్రబాబు