AP couple died in US accident: అమెరికా కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతుల మృతి..
ABN , Publish Date - Jan 05 , 2026 | 12:48 PM
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. వీరి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కృష్ణ కిశోర్ (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. వీరి కుమార్తె, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు (Andhra Pradesh couple America car crash).
కృష్ణ కిశోర్ పదేళ్ల క్రితం నుంచి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు (Telugu people accident US). వారి కుటుంబం అంతా అమెరికాలోనే నివసిస్తోంది. కృష్ణ కిశోర్ దంపతులు పది రోజుల క్రితమే పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లారు. అనుకోకుండా కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణ వార్త తెలిసి పాలకొల్లులో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
వెనెజువెలాపై అమెరికా దాడి.. భారత ఆయిల్ కంపెనీలకు లాభమేనా..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..