Home » Road Accident
ఉయ్యూరు- మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుంట సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్-విజయవాడ 65 వ జాతీయ రహదారిపై మరో ప్రమాదం సంభవించింది. విహారీ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. చిట్యాల మండలం పిట్టంపల్లి దగ్గరకు చేరుకోగానే బస్సులో మంటలు చెలరేగాయి.
తండ్రి కొనిచ్చిన పుట్టిన రోజు కానుక ఓ యువకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. బైకుపై వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఆ యువకుడు చనిపోయాడు. అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ప్రమాదం నుంచి అతను బయటపడడంతో వింతేమీ లేకున్నా..
బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు వైపు వెళ్తున్న బైక్.. లారీని ఢీకొన్న ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
గత వారం భారతదేశం అనేక పెద్ద ప్రమాదాలను, ఘోర విషాదాలను చవిచూసింది. దేశవ్యాప్తంగా గత వారం రోజుల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను బలిగొన్నాయి.
ఇవాళ(మంగళవారం) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి బస్సు ఢీ కొట్టినట్లు సమాచారం.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో వికారాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు...
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ... ప్రమాదాలు జరుగకుండా రవాణా శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన చేవెళ్ల ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డు, డివైడర్ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ .