Home » Road Accident
రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాలపై ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిధిలోని బైపాస్ రోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఒక కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై(ORR) ప్రయాణించే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఒక ముఖ్య గమనిక చేశారు. ఇటీవల కాలంలో ఆగి ఉన్న వాహనాలను వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొట్టడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
భాగ్యనగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడ్డంతో నలుగురు మహిళా టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది.
నేపాల్‌లోని రోల్పా జిల్లాలో జీపు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కూలీలను తీసుకెళుతున్న వ్యాన్ బోల్తా పడి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌లో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తమిళనాడులోని తిండివనం సమీపంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందగా, సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.