లారీ ఢీకొని ముగ్గురు యువకుల మృతి
ABN , Publish Date - Apr 08 , 2026 | 10:04 AM
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ.. ముగ్గురు యువకులను ఢీకొట్టింది.
నిజామాబాద్, ఏప్రిల్ 8: నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మద్నూర్ మండలం మేనూరు వద్ద ముగ్గురు యువకులను లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మద్నూర్ మండలం పెద్ద ఎక్లారాకు చెందిన నాగు, సచిన్, నాగల్ గాప్‌కు చెందిన అశోక్‌గా గుర్తించారు.
యువకుల మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు పోలీసులు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు.. యువకుల మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
బొలెరోను ఢీకొన్న డీసీఎం.. ఇద్దరి మృతి
Read Latest Telangana News And Telugu News