Home » Rains
వాతావరణంలో ఏర్పడిన మార్పులతో రాగల మూడు గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎడతెరిపి లేని వర్షాలతో అన్నదాత తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. కోతకోసిన పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నాడు. ఖరీఫ్ ఆరంభానికి ముందే బారుబావుల కింద వేరుశనగ సాగుచేశారు. పంట కాలం పూర్తవడంతో వేరుశనగను తొలగించారు.
హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కాస్త ఎండగానే ఉన్నా.. సాయంత్రం మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తెలంగాణతో పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు వస్తోంది. మూసీకి కూడా బారీ స్థాయిలో వరదనీరు చేరడంతో భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం దాల్చింది.
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో..
మదురైలో గురువారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. తల్లాకుళం, కోపుదూరు, మూండ్రుమావడి, కడచ్చనేందల్, ఒత్తకడై, మాట్టుతావని, అన్నానగర్, గోరీపాళయం, సింహక్కల్, పెరియార్ బస్టాండు తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి.
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.