Home » Rain Alert
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
భారత వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హైదరాబాద్‌లో భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొంది. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మరికొన్ని ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. క్యుములోనింబస్ మేఘాల వ్యాపించిన కారణంగా మరికాసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశముందని హెడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
Weather Alert: హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
Moosi River Flood Warning: వర్ష బీభత్సం కారణంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ మున్సిపాలిటీలో పలు కాలనీలు నీట మునిగాయి. సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి సెల్లార్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
కురిసేదాకా తెలియనే లేదు.. వరద పోటుతో బెంబేలెత్తించే భారీ వర్షం అని! ఉదయం నుంచి ఎండ దంచికొడితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి.
వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడం ప్రజల బయటకు రాకూడదని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ నగరం కుండపోత వర్షంతో తడిసి ముద్దయింది. సిటీలోని పలు కీలక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వందలాది మంది విద్యార్థులు, ప్రజలు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా అత్యవసర బృందాలను రంగంలోకి దించాయి.