HYD Heavy Rain Alert: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్.. జర భద్రం
ABN , Publish Date - Aug 09 , 2025 | 08:59 PM
భారత వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హైదరాబాద్‌లో భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొంది. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి(శనివారం) నుంచి ఈనెల 15వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే కొన్ని గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఈ ఎల్లో హెచ్చరిక 15వ తేదీ వరకూ ఉంటుందని తెలిపింది. కాగా, నగరంలో రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నగరవాసులు తమ ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
భారత వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హైదరాబాద్‌లో భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొంది. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించింది. అధికారులు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. వెంటనే ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఆగస్టు 13న భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌తోపాటు నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబ్ నగర్, నారాయణపేట, జగిత్యాలలో బలమైన తుపానులు సంభవింవే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
NTPC: తెలంగాణలో ఎన్టీపీసీ రూ. 80 వేల కోట్ల ఫ్లోటింగ్ సోలార్ పెట్టుబడులు
Konidala Chiranjeevi: సినీ కార్మికుల వేతనాల పెంపునకు నేను హామీ ఇవ్వలేదు: చిరంజీవి