Home » Puttaparthy
మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన రైతులు చిత్రావతి నదిలో ఇసుక అక్రమ తరలింపులను అరికట్టాలని తహసీల్దార్ మారుతికి సోమవారం వినపత్రిం అందించారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఫీల్టర్‌బావులు, బోర్లు వేసుకుని పంటలు పంటలు పండిస్తున్నట్లు రైతులు తెలిపారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు రూ.18.53లక్షల విలువచేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు.
విద్యుతశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు, సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఆ శాఖ సిబ్బంది, అధికారులు ఉన్నా రా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో ఎక్కడైనా ట్రాన్సఫార్మర్లలో ఫ్యూజ్ పోతే కూడా వేసే నాథుడే లేడని వినియోగదారులు, రైతులు మండిపడుతున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా పట్టు చీరలు చిరిగిపోయాయని చేనేత కార్మికులు వాగ్వాదానికి దిగారు. ధర్మవరం నుంచి సోమందేపల్లి మీదుగా హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ కాంట్రాక్టు బస్సును ఆపి, డ్రైవర్‌ను నిలదీశారు.
ఇన సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని శెట్టిపల్లి, కొండాపురం, రాంపురం, పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, మరువపల్లి, తిమ్మాపురం హైస్కూల్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
దేవుడికి సేవ చేయాలన్నదే నా లక్ష్యమని సూగూరు ఆంజనేయస్వామి ఆలయ నూతన చైర్మన వైసీ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆలయం వద్ద చైర్మన, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి శనివారం మండలలంలో పింఛన్ల పంపిణీలో పాల్గొ న్నారు. మం డలంలోని రెడ్డి పల్లి, బండవాం డ్లపల్లి, చారు పల్లి, కొత్తపల్లి తండా, వేళ్లమద్ది, బండకింద తండాలో వారు పాల్గొని పింఛన్లు అందజేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని ఎమ్మెల్యే పల్లెసింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పే ర్కొన్నారు. మండలంలోని కొడపగానిపల్లి, వేములేటిపల్లిలకు చెందిన 55 వైసీపీ కుటుం బాలు బుధవారం టీడీపీలో చేచాయి.
భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ హైదరాబాద్-1 డిపో(Hyderabad-1 Depot) నవంబరులో ప్రతీ శనివారం సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు డిపో మేనేజర్ ఎం.వేణుగోపాల్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తలమర్ల సహకార సంఘం అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు.