దేవుడి సేవే లక్ష్యం
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:59 PM
దేవుడికి సేవ చేయాలన్నదే నా లక్ష్యమని సూగూరు ఆంజనేయస్వామి ఆలయ నూతన చైర్మన వైసీ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆలయం వద్ద చైర్మన, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
హిందూపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): దేవుడికి సేవ చేయాలన్నదే నా లక్ష్యమని సూగూరు ఆంజనేయస్వామి ఆలయ నూతన చైర్మన వైసీ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఆలయం వద్ద చైర్మన, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆలయ అధికారులు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పూజల్లో ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, జనసేన ఉమేష్, బేవనహళ్లి ఆనంద్, అశ్వత్థనారాయణరెడ్డి, మంగేష్, రామక్రిష్ణప్ప, రాజు, ఆదినారాయణప్ప, వెంకటరమణ, అనిల్‌కుమార్, మంజు పాల్గొన్నారు.
రాతివిగ్రహానికి శంకుస్థాపన: సూగూరు ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో 40 అడుగుల రాతి విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలుచేశారు. కార్యక్రమంలో ఎంపీతోపాటు ఆలయ ఛైర్మన చంద్రశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.