Share News

MLA: అభివృద్ధి బాటలో రాష్ట్రం

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:21 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని ఎమ్మెల్యే పల్లెసింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పే ర్కొన్నారు. మండలంలోని కొడపగానిపల్లి, వేములేటిపల్లిలకు చెందిన 55 వైసీపీ కుటుం బాలు బుధవారం టీడీపీలో చేచాయి.

MLA:  అభివృద్ధి బాటలో రాష్ట్రం
YCP leaders joined TDP in presence of MLA

-ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె

- 55 కుటుంబాలు టీడీపీలో చేరిక

కొత్తచెరువు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని ఎమ్మెల్యే పల్లెసింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పే ర్కొన్నారు. మండలంలోని కొడపగానిపల్లి, వేములేటిపల్లిలకు చెందిన 55 వైసీపీ కుటుం బాలు బుధవారం టీడీపీలో చేచాయి. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాట్లాడుతూ...గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో జానెడు సీసీరోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. ప్రధాన రహదారులు గుంతలమయమైనా తారురోడ్డు వేయలేదన్నారు. వైసీపీ పాలకులు దోచుకుని దాచుకోవడంతో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. ఉన్న కంపెనీలు రాష్ట్రాన్ని వదిలివెళ్లేలా పాలనా సాగించారని మండిపడ్డారు.


దీంతో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. వారు నెత్తిన పెట్టిన అప్పులను అంచెలంచెలుగా చెల్లిస్తూ రాష్ట్రాన్ని అబివృద్ధి బాటలోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రధానంగా ఎన్నికలలో ఇచ్చిన సూపర్‌సిక్స్‌ హామీలను నెరవేర్చడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయన్నారు. ప్రజలు కూడా అభివృద్ది చేసే ప్రభుత్వం వైపే మక్కువ చూపుతున్నారన్నారు. స్వచ్ఛందంగా కొడపగానిపల్లిలో 31కుటుం బాలు, వేములేటిపల్లిలో 24 కుటుంబాలు వైపీపీని వీడి టీడీపీలోకి చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తూ టీడీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ అడపాల రామకృష్ణ, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన డైరెక్టర్‌ ఒలిపి శీన నాయకులు, కొడపగానిపల్లి శివ, బండ్లపల్లిరాజు, గోపాల్‌రెడ్డి, లోచర్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 29 , 2025 | 11:21 PM