FARMERS: ఇసుక అక్రమ తరలింపును అరికట్టండి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:13 AM
మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన రైతులు చిత్రావతి నదిలో ఇసుక అక్రమ తరలింపులను అరికట్టాలని తహసీల్దార్ మారుతికి సోమవారం వినపత్రిం అందించారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఫీల్టర్‌బావులు, బోర్లు వేసుకుని పంటలు పంటలు పండిస్తున్నట్లు రైతులు తెలిపారు.
గోరంట్ల, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన రైతులు చిత్రావతి నదిలో ఇసుక అక్రమ తరలింపులను అరికట్టాలని తహసీల్దార్ మారుతికి సోమవారం వినపత్రిం అందించారు. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఫీల్టర్‌బావులు, బోర్లు వేసుకుని పంటలు పంటలు పండిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇసుక తరలింపు వల్ల పంటలకు అవరోధం ఏర్పడుతుందన్నారు. బూదిలిపి, పాపిరెడ్డిపల్లికి చెందిన ఆరుగురు ట్రాక్టర్ యజమానుల పేర్లు వెల్లడించారు. అక్రమ రవాణాను అరికట్టాలని వారు కోరారు. అలాగే పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలోని కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. గంగాధర్, స్వర్ణలత, అంజలి, ఆంజనేయులు, ముత్యాలప్ప, చిన్నయ్య, లోకేష్, లక్ష్మి, వెంకటమ్మ పాల్గొన్నారు.