EMPLOYEES: అందుబాటులో లేని విద్యుత సిబ్బంది
ABN , Publish Date - Nov 09 , 2025 | 12:29 AM
విద్యుతశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు, సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఆ శాఖ సిబ్బంది, అధికారులు ఉన్నా రా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో ఎక్కడైనా ట్రాన్సఫార్మర్లలో ఫ్యూజ్ పోతే కూడా వేసే నాథుడే లేడని వినియోగదారులు, రైతులు మండిపడుతున్నారు.
- సకాలంలో పరిష్కారం కాని సమస్యలు
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు , రైతులు
నల్లమాడ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): విద్యుతశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు, సామాన్య వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఆ శాఖ సిబ్బంది, అధికారులు ఉన్నా రా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో ఎక్కడైనా ట్రాన్సఫార్మర్లలో ఫ్యూజ్ పోతే కూడా వేసే నాథుడే లేడని వినియోగదారులు, రైతులు మండిపడుతున్నారు. మండలంలో పనిచేసే విద్యుతశాఖ అధికారులు, సిబ్బంది అందరూ పట్టణాలలోనే నివాసాలు ఉంటూ చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారని విమర్శలు ఉన్నాయి. వర్షాకాలంలో రాత్రిపూట ఫ్యూజు పోతే విద్యుత సరఫరా నిలిచిపోతుంది. అలాంటి సమయంలో రాత్రంతా ఇళ్లల్లో కరెంట్ లేక దోమల బెడదతో పాటు ఉక్కపోత తప్పదని అంటున్నారు. ఇనచార్జ్ అధికారులతో మరింత సమస్యగా మారింది. విద్యుతశాఖలో ఏ చిన్న సమస్య వచ్చినా పట్టణాలలో ఉన్న అధికారులకు ఫొన చేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. తమ దగ్గర ప్రైవేటు హెల్పర్‌గా పనిచేస్తున్న వారిని పురమాయిస్తుంటారు. వారికి ఖర్చులకు ఇవ్వాల్సి వస్తోందని రైతులు అంటున్నా రు. మండలంలో 14 పంచాయతీలు ఉ న్నాయి, ఒక్కో పం చాయతీకి ఒకరు చొప్పున లైనమ్యానలు (హెల్పర్) ఉం డాల్సి ఉండగా.. ప్ర స్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. పోల్ టు పోల్ వర్కర్లు సైతం ఆరుగురే ఉన్నారు. లైనమ్యానలు, పోల్ టు పోల్ వర్కర్లు కూడా స్థానికంగా ఉండకపోవడంతో సమస్యగా మారింది.
ఓడీచెరువు ఏఈ నల్లమాడ మండలానికి ఇనచార్జ్‌గా పనిచేస్తున్నారు. మండల వ్యాప్తంగా విద్యుతలైన్లు, ట్రాన్సఫార్మర్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చాలా గ్రామాల్లో విద్యుత తీగలు చేతికందే విధంగా వేలాడుతున్నాయి. కొన్ని చోట్ల విద్యుత వైర్లు చెట్ల మధ్యలో దర్శనమిస్తున్నాయి. మండల కేంద్రంలో నిత్యం గంటల తరబడి విద్యుత సర ఫరాలో అంతరాయ కలుగుతుండడంతో వివిధశాఖల కార్యాలయాల్లో ఇబ్బంది పడుతున్నారు. ఎర్రవంకపల్లిలో రామచంద్రారెడ్డికి అనే రైతుకు ఐదెకరాల మామిడితోట ఉంది. ఆ తోటలో 11కేవీ వైర్లు చేతికి అందే ఎత్తులో వేలాడుతున్నాయని ఆయన తెలిపారు. విద్యుత శాఖ అధికారులకు గోడును విన్నవించుకున్నా ఫలితం లేదని ఆయన వాపోయారు. గాలి, వానకు రెండు వైర్లు జాయింట్ అయితే పెద్ద ప్రమాదమే జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చౌటకుంటపల్లిలోని నాగభూషణరెడ్డి అనే రైతుకు చెందిన పొలంలో 11కేవీ లైన వైర్లు మామిడి చెట్ల మీదుగా పడి ఉన్నాయి. వైర్లు ఆరు అడుగుల ఎత్తులో ఉన్నాయని గతంలో ఏఈకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికంగా ఉండాలని ఆదేశించాం - శ్రీకృష్ణదేవ, డీఈ, విద్యుతశాఖ
విద్యుతశాఖలో పనిచేసే సిబ్బంది మండల కేం ద్రంలోనే నివాసాలు ఉండాలని ఇప్పటికే ఆదేశిం చాం. ఈ మేరకు గత నెలలోనే సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడ పనిచేస్తారో అక్కడే నివాసాలు ఉండాలని, అలాంటప్పుడే రైతులకు అం దుబాటులో ఉండగలరని సూచించాం. తద్వారా సులువుగా సమస్యలు పరిష్కరించేందుకు వీలవుతుందని చెప్పాం. మండల కేంద్రాల్లో నివాసం లేకపోతే శాఖాపరమైన చర్యలు చేపడతాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....