Share News

STU: ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:01 AM

ఇన సర్వీస్‌ ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని శెట్టిపల్లి, కొండాపురం, రాంపురం, పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, మరువపల్లి, తిమ్మాపురం హైస్కూల్‌, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

STU: ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలి
STU leaders enrolling membership

పెనుకొండ టౌన, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఇన సర్వీస్‌ ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని శెట్టిపల్లి, కొండాపురం, రాంపురం, పెనుకొండ, వెంకటరెడ్డిపల్లి, మరువపల్లి, తిమ్మాపురం హైస్కూల్‌, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సభ్యత్వ నమోదు, సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టెట్‌ మినహాయించేవిధంగా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి సుప్రీం కోర్టులో పిటిషన దాఖలు చేయాలన్నారు. ఐదు సంవత్సరాలకు పైగా సర్వీస్‌ ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలోపు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ పాస్‌కావాలని సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చిందన్నారు. ఉపాధ్యాయులందరూ టెస్ట్‌రాసి పాస్‌కావాలని ప్రభుత్వం నిబంధనలు విధించకుండా సుప్రీం కోర్టులో ఇనసర్వీసు టీచర్లకు మినహాయింపు పిటిషన దాఖలు చేయాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్‌, స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ రవీంద్ర, లక్ష్మీనర్సింహప్ప, విజయ్‌, నర్సింహారెడ్డి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:01 AM