MLA: కూటమి ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:25 AM
కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తలమర్ల సహకార సంఘం అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి
కొత్తచెరువు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తలమర్ల సహకార సంఘం అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులను, కుంటలను నింపుతున్నామని తెలిపారు. రైతు బాగుంటేనేదేశం బాగుంటుందన్న సంకల్పంతో పీఎం మోదీ, సీఎం చంద్రబాబు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం తలమర్ల చెరువు మరువ వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగపూజ చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎస్‌ఐడీసీ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, మార్కెట్‌యార్డ్ చైర్మన పూలశివ, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన కన్వీనర్ వలిపి శీన, నాయకులు సామకోటి ఆదినారా యణ, వెంకటరెడ్డి, నరసింహులు, జయచంద్ర, రైతులు పాల్గొన్నారు.