Home » Protest
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలపై పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. నిరసనల పేరిట సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నాయని వ్యాఖ్యానించారు.
విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో ఓ యువతి ఘటన వైరల్ అవుతోంది. ముంబైలో పోలీసుల వాహనాన్ని అడ్డుకుని ఆమె నిరసనకారులకు మద్దతు తెలిపారు. వివరాల్లోకెళితే...
దేశ రాజధాని ఢిల్లీ బుధవారం అర్ధరాత్రి వేళ నిరసనలతో దద్దరిల్లింది. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు, ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు.
హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఆందోళన నెలకొంది.
పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టిన సీజేపీతో కేంద్రం చర్చలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నట్టు సీజేపీ వెల్లడించింది.
దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ (సోమవారం) పార్లమెంట్ మార్చ్ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలు, మద్దతుదారులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకోవడంతో భద్రతా దళాలు లాఠీఛార్జ్ చేశాయి.
కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా తాను చేస్తున్న నిరాహార దీక్షను ఈరోజు విరమిస్తానని ఆయన ప్రకటించారు. అయితే, తాను ప్రతిపాదించిన మూడు షరతులు నెరవేరితేనే నిరశన దీక్షను విరమిస్తానని తెలిపారు.
ప్రవేశ పరీక్షలు, రిక్రూట్మెంట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను పరిష్కరించేందుకు ప్రస్తుత విద్యా వ్యవస్థలో సంస్కరించాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
ఢిల్లీలో ఈ నెల 6న తలపెట్టిన నిరసనకు ముందు సీజేపీకి చెందిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సీజేపీకి మద్దతుదారుడైన ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.