Home » Prathyekam
రోజూ మనం వాట్సాప్, సోషల్ మీడియా పోస్టుల్లో ఉపయోగించే చిన్న ఎమోజీలకు కూడా ఒక ప్రత్యేక రోజు ఉందని మీకు తెలుసా? ప్రతి సంవత్సరం జులై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవం నిర్వహించుకుంటారు. ఈ రోజు వెనుక ఉన్న చరిత్ర, ఎమోజీల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
తల్లి ఐసీయూలో చికిత్స పొందుతోందని తెలుసుకున్న ఓ జొమాటో డెలివరీ బాయ్‌కు కస్టమర్ చేసిన చిన్న సహాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది. ఆ కస్టమర్ మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చిన్న గ్రామంలో మొదలైన ఓ యువకుడి కల.. నేడు కాలిఫోర్నియాలోని ప్రపంచ దిగ్గజ కంపెనీలో నిజమైంది. ఐఐటీ చదవకుండానే ప్రతిభ, పట్టుదలతో రూ.2.6 కోట్ల ప్యాకేజీతో జాబ్ సాధించిన ఆ యువకుడి ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
ప్రేమను మాటల్లో కాకుండా ముద్దులతో ప్రపంచానికి చాటిందో జంట. కేవలం 30 సెకన్లలో ఏకంగా 195 ముద్దులు పంచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రేమకు గుర్తుగా చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
సమోసాల కోసం ఓ లోకో పైలట్ రైలు ఆపి.. సమీపంలోని దుకాణానికి వెళ్లి సమోసా కొన్నాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఇందౌర్‌లోని రంగ్వాసా ప్రాంతంలో రైలును లోకో పైలట్ నిలిపివేశాడు.
ఓ నాయకుడు తన పుట్టిన రోజు వేడుకలను మురికి కాలువలో జరుపుకొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చీరకట్టులో ఓ మహిళ పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్‌ను తలపించేలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అమెజాన్‌లోని కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. రోజూ కొత్త మనుషులను కలవడం, ప్రయాణాలను ఆస్వాదించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.
ఆకాశమే హద్దుగా కలలు కంటున్న ఓ చిన్నారి.. దానిని యూనిఫామ్ రూపంలో మోస్తూ ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టింది. పైలట్ వేషధారణలో కనిపించి అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. భవిష్యత్తులో ఎలాగైనా పైలట్ కావాలన్న ఆ చిన్నారి ఆశయం.. నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
సాధారణంగా మనుషులకు చేతికి ఐదు వేళ్లు ఉంటాయి. అయితే కొందరు అదనపు వేలితో, అంటే ఆరు వేళ్లతో జన్మిస్తారు. వైద్యశాస్త్రం దీన్ని జన్యుపరమైన లక్షణంగా పేర్కొంటుండగా, హస్తసాముద్రిక శాస్త్రం మాత్రం దీనిని అదృష్టానికి సంకేతంగా వివరిస్తుంది.