Share News

అమెజాన్ ఉద్యోగం వదిలి ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:01 PM

అమెజాన్‌లోని కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. రోజూ కొత్త మనుషులను కలవడం, ప్రయాణాలను ఆస్వాదించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.

అమెజాన్ ఉద్యోగం వదిలి ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి.. వీడియో వైరల్
Hyderabad Uber Driver

ఇంటర్నెట్ డెస్క్: తాను ఇష్టపడే జీవితాన్ని ఎంచుకోవడానికి అమెజాన్‌లోని కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన నిర్ణయంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన చెబుతూ, రోజూ కొత్త మనుషులను కలుస్తూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. సాఫ్ట్‌వేర్ డెవలపర్ చేత్నా సింగ్ తన ప్రయాణంలో ఉబెర్ డ్రైవర్‌ కుమార్‌తో మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది.


వీడియోలో కుమార్ మాట్లాడుతూ.. 2014 సంవత్సరంలోనే తాను అమెజాన్‌లోని ఉద్యోగాన్ని వదిలి డ్రైవింగ్ రంగంలోకి వచ్చానని ఆయన చెప్పారు. దాదాపు పదేళ్లు గడిచినా తన నిర్ణయంపై ఎలాంటి బాధ లేదని ఆయన తెలిపారు. డ్రైవింగ్ తనకు కేవలం ఒక ఉద్యోగం కాదని, రోజు కొత్త మనుషులను కలవడం, వారి కథలను వినడం, నగరాన్ని అన్వేషించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. ఇప్పటివరకు దాదాపు 23,600 రైడ్‌లు పూర్తి చేసినప్పటికీ.. అదే ఉత్సాహంతో పని చేస్తున్నానని కుమార్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.


సామాజిక ఒత్తిడి వల్ల చాలామంది తమ అభిరుచులను పక్కన పెడతారని, కానీ తనకు ఆనందం ఇచ్చే మార్గాన్ని ఎంచుకున్న ఈ వ్యక్తి కథ స్ఫూర్తిదాయకమని సాఫ్ట్‌వేర్ డెవలపర్ చేత్నా సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేలాది మందిని ఆకట్టుకుంది. మనకు నచ్చిన పని చేయడంలోనే నిజమైన సంతోషం, సంతృప్తి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగ హోదాల కంటే అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమని ప్రశంసించారు.


Also Read:

పాక్ పోలీసుల కాల్పులు.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక దుర్మరణం

మ్యాచ్ డ్రా.. తుపాకీ పేల్చి సంబరాలు చేసుకున్న ఇరాన్ ప్లేయర్!

Updated Date - Jun 16 , 2026 | 01:02 PM