Home » Ponguleti Srinivasa Reddy
రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానం సోమవారం(12వ తేదీ) నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి రానుంది.
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకుపోతున్న ప్రభుత్వం.. సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు కేసీఆర్ ఘన కార్యమేనని, తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకోమని తేల్చిచెప్పారు. తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు.
తెలంగాణ భూపరిపాలనలో నూతన అఽధ్యాయానికి నాంది పలికిన భూభారతి చట్టం రైతులకు రక్షణ కవచమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
పేదోడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం అమలులో అవినీతికి తావు లేకుండా నిజాయితీగా, నిబద్ధతతో భాగస్వాములు కావాలని గృహ నిర్మాణశాఖ అసిస్టెంట్ ఇంజనీర్ల (ఏఈ)కు రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు చెప్పారు.
Minister Ponguleti Srinivas Reddy: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేదోడి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
భూములకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేస్తారా ధరణి రికార్డే భూ భారతిలో ఉంది కదా ఇది కొత్త రికార్డు ఎలా అవుతుంది ధరణి కింద ఇచ్చిన పాస్ పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా పాస్‌పుస్తకాలు, ఇతర సమస్యలపై గతంలో పెట్టిన దరఖాస్తులు చెల్లుతాయా.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిన నేపథ్యంలో రైతులకున్న కొన్ని సందేహాలివి.
రాష్ట్రంలో ఎండలు, వడగాలుల నుంచి ప్రజల్ని రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.