Ponguleti: 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
ABN , Publish Date - May 15 , 2025 | 03:18 AM
రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మొత్తం రెవె న్యూ సేవలు ప్రజలకు దూరమయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసి మెరుగైన సేవలను అందిస్తామని బుధవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.
ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో తొలుత ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, రెండో దశలో భాగంగా మే 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరో 28 మండలాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. సాదాబైనామాలకు సంబంధించి కోర్టులో కేసు ఉన్నందున, స్టే ఎత్తి వేసిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..
Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
Read Latest Telangana News And Telugu News