Share News

Ponguleti: మంత్రి పొంగులేటి ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - May 15 , 2025 | 08:27 AM

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‎రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగబోదన్నారు. అలాగే పథకాల అమలులో కూడా పక్షపాతం ఉండబోదన్నారు. ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

Ponguleti: మంత్రి పొంగులేటి ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- గవర్నర్‌ దత్తత గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం

- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌: గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ(Governor Jishnu Dev Varma) దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి, ఆదిలాబాద్‌ జిల్లాలోని భుర్కి, మంగ్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అప్పాపూర్‌, బౌరాపూర్‌ గ్రామాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) అన్నారు. బుధవారం గవర్నర్‌తో రాజ్‌భవన్‌లో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ఆలోచన, సీఎం రేవంత్‌(CM Revanth) సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని,

ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: ఇక.. క్షేత్రస్థాయి పర్యటనకు కమిషనర్‌ రంగనాథ్‌.. అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు


city3.2.jpg

ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇస్తుండగా గిరిజన నియోజకవర్గాలకు అందుకు అదనంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. భూ భారతి చట్టం అమలు గురించి కూడా గవర్నర్‌కు వివరించారు. ఎలాంటి రుసుము లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, ఐడీసీ చైర్మన్‌ మువ్వ విజయబాబు, హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తదితరులు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Read Latest Telangana News and National News

Updated Date - May 15 , 2025 | 08:27 AM