Ponguleti: కర్ణాటక తరహా లైసెన్స్‌డ్ సర్వేయర్లు
ABN , Publish Date - May 16 , 2025 | 04:20 AM
రాష్ట్రంలో భూ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా గ్రామ స్థాయిలో లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

తొలిదశలో 5 వేల మంది నియామకం: పొంగులేటి
హైదరాబాద్, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూ లావాదేవీలను పారదర్శకంగా నిర్వహించడానికి వీలుగా గ్రామ స్థాయిలో లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కర్ణాటకలో విజయవంతమైన లైసెన్స్‌డ్ సర్వేయర్ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయడానికి కార్యచరణ రూపొందిస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తొలిదశలో 5 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని, ఇందుకోసం ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులకు సర్వే అకాడమీలో 50 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కర్ణాటకలో అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వేయర్ విధానంపై ఇటీవల సర్వే విభాగానికి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు
For Telangana News And Telugu News