Home » Politics
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గవర్నమెంట్ స్కూల్‌లోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ ఘటనలో ప్రధానోపాధ్యాయురాలిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
. బైపోల్ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ లో నవీన్ యాదవ్ కు మద్దతుగా సీతక్క విస్తృతంగా పర్యటించారు. నవీన్ యాదవ్‌ను పదే పదే రౌడీ షీటర్ అని బీఆర్ఎస్ వాళ్లు అనడం కరెక్ట్ కాదని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలవాలన్న దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఆ దిశగా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు.
కాకినాడ-మచిలీపట్నం మధ్య మొంథా తుపాన్ తీరాన్ని తాకిందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలిందని తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌లను సుప్రీంకోర్టు సస్పెన్షన్‌లో పెట్టినా.. రివ్యూ పిటిషన్ వేయకపోవటం దారుణమని కవిత పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్‌ల పర్మిషన్ ఆపేసి లిస్ట్ నుంచి తీసేసినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదన్నారు.
ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ను మంగళవారం ఆమె సందర్శించారు. భూ నిర్వాసితులకు ఏ రోజు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందో ఆనాటి రేటు కట్టి ఇవ్వాలని చెప్పారు.
వైసీపీ హ్యాబిచ్యువల్ అఫెండర్స్ మరోసారి ఫేక్ ప్రచారానికి దిగారని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. నిన్న గురుకుల పాఠశాల... నేడు రోడ్లు..! అంటూ ఒక ఫొటోను జోడించారు.
దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో, రోజుల్లో పరిష్కారం చూపుతోందంటూ పలువురు తమ పనితీరును ప్రశంసిస్తున్నారని హైడ్రా స్పష్టం చేసింది. కబ్జాలు జరుగుతుంటే నగర ప్రజలు చూస్తూ ఊరుకోవడంలేదని.. నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపింది.
రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మైనారిటీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు సోమవారం ఆటోలో కేటీఆర్ ప్రయాణించి మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. వారికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.