Guntur: చనిపోయిన కోళ్లను కూడా షాపుల్లో అమ్ముతున్నారు: ప్రకాష్ నాయుడు
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:50 AM
మాంసాభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు తనీఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులతో కలసి మాంసం విక్రయ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
గుంటూరు, నవంబర్ 2: గుంటూరు పట్టణంలోని మాంసాభివృద్ధి కార్పోరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు తనీఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులతో కలసి మాంసం విక్రయ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వ చేసిన మాంసం అమ్ముతున్న వారిని అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా మీట్ కార్పోరేషన్ చైర్మన్ ప్రకాష్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో మాంసం దుకాణాలను తనిఖీ చేశామని చెప్పారు. ప్రజలకు కల్తీ లేని చికెన్, మటన్ అందించడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు.
చనిపోయిన కోళ్లను కూడా షాపుల్లో అమ్ముతున్నారని అన్నారు. ఫ్రిడ్జ్ లో మాంసం పెట్టి రోజులపాటు ఉంచితే బ్యాక్టీరియా వచ్చి ప్రజలు అనారోగ్యనికి గురి అవుతున్నారని చెప్పారు. వారం రోజులు ఫ్రిడ్జిల్లో పెట్టి ఉండడం వలన వాంతులు విరేచనాలు అవుతాయన్నారు. వేడి నీళ్లతో పరిశుభ్రమైన వాతావరణం లో మాంసాన్ని శుభ్రపరచాలని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు లేని షాపులకు జరిమానా విధించామన్నారు.
ఇవి కూడా చదవండి:
Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీ
Jogi Ramesh: కల్తీ మద్యం కేసు.. అరెస్ట్‌పై స్పందించిన జోగి రమేష్