Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 09:51 AM
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో తాజాగా ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం, నవంబర్ 2: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు. కమిటీలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ASP కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ ఉన్నారు. తొక్కిసలాటకు గల కారణాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఇలా ఉండగా, కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 10 మంది మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనమైన విషయం విదితమే. 9 మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఈ ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లోని స్వామివారి దర్శనం కోసం మెట్లు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది.
భక్తుల రద్దీ తో మెట్ల రెయిలింగ్ ఊడిపడింది. ఈ క్రమంలో భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News