Jogi Ramesh: కల్తీ మద్యం కేసు.. అరెస్ట్‌పై స్పందించిన జోగి రమేష్
ABN , Publish Date - Nov 02 , 2025 | 08:50 AM
న అరెస్ట్ పై వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తొలిసారి స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. తానేం నేరం చేయలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, నవంబర్ 2: కల్తీ మద్యం కేసులో తన అరెస్ట్ పై వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ తొలిసారి స్పందించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. తానేం నేరం చేయలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ తొక్కిసలాట జరిగితే స్పందించలేదన్నారు. 10 రోజులుగా తన ప్రమేయం లేదని చెబుతున్నా అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
కాసేపటి క్రితమే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు అయ్యారు. ఆయనకు ఎక్సైజ్ శాఖ అధికారులు సెర్చ్ వారెంట్ అందజేశారు. రమేష్ ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తన నివాసం నుంచి బయటకు వచ్చిన జోగి రమేష్ ను తనిఖీలు అనంతరం అరెస్టు చేశారు.
అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసారని కాదని వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యం కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం కేసులో తమ ప్రమేయం లేదని చెప్పారు. కక్ష సాధింపులో భాగంగానే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది తనను, ఇప్పుడు తన తండ్రిని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు ఎల్లకాలం సాగవని ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకుంటే మంచిదని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో.. జోగి రమేష్ అరెస్ట్..
BRS Executive President KTR criticized Congress: కాంగ్రెస్‌తో ఫేక్ బంధం.. బీజేపీతో పేగు బంధం