Home » Phone tapping
ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి ప్రజలందరికీ తెలియాలని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నాడు పేదలపై అరాచకాలు చేశారని.. ఈనాడు సామాజిక న్యాయం అంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2023 నంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ ఫోన్ ట్యాపింగ్ భారీగా జరిగినట్లు గుర్తించారు. ప్రణీత్ రావు అండ్ టీమ్ కలిసి ఏకంగా 4,013 ఫోన్ నంబర్లను ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది.
Telangana Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 4013 పోన్ నెంబర్లను ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాపింగ్ చేశారు. వారిలో 618 మంది పొలిటికల్ లీడర్ల పోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి మాజీ సీఎం కేసీఆర్ కోసం పనిచేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ట్యాపింగ్ 2023లో ఎన్నికల ముందే కాదని.. 2018 ఎన్నికలు, ఇతర కీలక సందర్భాల్లోనూ జరిగిందని అధికారులు గుర్తించారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మెన్ దేవరాజు గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయన్ను సిట్ బృందం ఆదేశించింది.
దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ అతిపెద్ద నేరమని.. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలని కాంగ్రెస్ కేడర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కార్యకర్తలకు పార్టీలో తగిన గౌరవం ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ప్రభుత్వ అధినేత చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్‌రావు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌కు నోటీసులు ఎందుకివ్వడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. నాడు సీఎంవోతోపాటు సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్‌రావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం మరోసారి విచారించింది.