Home » Penukonda
తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, వైస్ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీనిపై పలుమార్లు ట్రాన్సకో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపనపోలేదని తిమ్మాపురం రైతులు వాపోతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎన్నోరకాలుగా ఆర్డీటిసంస్థ చేయూతనిచ్చిందని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలిలో ప్రభుత్వ స్థలంలో నివాసమున్న పేదలకు న్యాయం చేయాలని తహసీల్దార్ మారుతికి సోమవారం కార్మిక సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు.
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషిచేయాలని మంత్రి సవిత సూచించారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
: అధైర్యపడకండి తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మహ్మద్‌ఖాన కుటుంబానికి మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామ మాజీ సర్పంచ మహ్మద్ ఖాన అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు.
వ్యవసాయంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో సంతోషాన్ని నింపేందుకే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు శంకర్‌లాల్ నాయక్ తెలిపారు.
బీసీల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు శ్వాస అని రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి సవిత మాట్లాడారు.
రాయచోటిలో 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవం సమయంలో హిందువులపై దాడిచేసిన వారిని అరె్‌స్టచేసి కఠినంగా శిక్షించాలని వీహెచపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
ప్రముఖ తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.