అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:17 AM
కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
పెనుకొండ రూరల్, న వంబరు 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అం దేలా చర్యలు తీసుకోవాలని ఎంపీపీ గీత సూచించారు. సోమవారం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వ్యవసాయశాఖాధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఈక్రాప్ నమోదు వందశాతం పూర్తయిందని, డ్రోన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉపాధిహామీ అధికారులు మాట్లాడుతూ ఉపాధికూలీలకు ఈకేవైసీ చేయిస్తున్నామన్నారు. మండలంలో స్మార్ట్ రేషనకార్డుల పంపిణీ పూర్తయినట్లు తెలిపారు. ట్రాన్సకో అధికారులు మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ యోజన దరఖాస్తులు అందరికీ అందుబాటులో ఉన్నాయని కరెంటు బిల్లు 99శాతం తగ్గుతుందన్నారు. ఎంపీడీఓ నరే్‌షకృష్ణ, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.