CPM: రేషన మాఫియాను అరికట్టండి
ABN , Publish Date - Nov 11 , 2025 | 12:16 AM
మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్‌లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు.
సోమందేపల్లి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా ఉన్న రేషన షాపుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలింపును అరికట్టాలని సీపీఎం జిల్లా నాయకుడు పెద్దన్న కోరారు. రెండు చోట్ల డంప్‌లు ఏర్పాటుచేసుకుని టెంపోలు, లారీలలో వాటిని తరలిస్తున్నట్లు ఆరోపించారు. అధికారులకు సమాచారం ఉన్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. మండలంలో ఏర్పాటుచేసిన మద్యం దుకాణదారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖాధికారులు తమకేమిపట్టనట్లు చోద్యం చూస్తున్నారన్నారు. మద్యం అక్రమ విక్రయాలను, రేషన మాఫియా అరికట్టాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రాన్ని అందించారు. హనుమయ్య, మాబు, కొండా వెంకటేశులు, నాగభూషణం, నాగరాజు, వలీ, ఆనంద్, మసూద్ పాల్గొన్నారు.