NSS: ముగిసిన ఎనఎ్‌సఎ్‌స ప్రత్యేక శిబిరం
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:18 AM
స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది.
పెనుకొండ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎనఎ్‌సఎ్‌స యూనిట్-2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం సోమవారంతో ముగిసింది. ఆఖరిరోజు ఎనఎ్‌సఎ్‌స అధికారి జయప్ప ఆధ్వర్యంలో మంగాపురం గ్రామంలో డ్వాక్రా భవన చుట్టూ శుభ్రంచేసి బ్లీచింగ్ చెల్లారు. ఎనఎ్‌సఎ్‌స పీఓ జయప్ప, వలంటీర్లతో కలిసి వికసిత భారత 2047లో యువత పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం మంగాపురం గ్రామంలో ఎనఎ్‌సఎ్‌స వలంటీర్ల సేవలను గుర్తించిన మాజీ సర్పంచ చంద్రకాంతమ్మ దంపతులు, గ్రామస్థులు పీఓ జయప్పను ఘనంగా సత్కరించారు. ఎనఎ్‌సఎ్‌స శిబిరానికి సహకారం అందించిన మాజీ సర్పంచ, గ్రామస్థులుసత్కరించారు. అధ్యాపకులు ప్రతాప్, రామన్న, నాగే్‌షగౌడ్, చంద్రమోహన, మారుతి పాల్గొన్నారు.