MINISTER SAVITHA: స్థానిక సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Nov 18 , 2025 | 12:22 AM
స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు.
పెనుకొండ టౌన, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి సవిత మండల నాయకులకు సూచించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పెనుకొండ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమస్యలు ఏవైనా ఉంటే నా దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన పలువురి వినతులను మంత్రి సవిత తీసుకున్నారు. యాదవ కార్పొరేషన డైరెక్టర్ కేశవయ్య, మాధవనాయుడు, నారాయణస్వామి, కన్వీనర్ ప్రసాద్, సూర్యనారాయణ, బాబుల్‌రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.