Home » Parliament
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నేళ్లుగా పదవిలో కొనసాగుతున్నారో అన్నేళ్లపాటు దేశ స్వాతంత్ర్య కోసం జవహర్ లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపారని ప్రియాంక గాంధీ గుర్తుచేశారు.
పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. వందే మాతరం జాతీయ గేయం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు లోక్ సభ, రాజ్యసభలో దీని గురించి చర్చ జరుగుతోంది. సభల్లో జరిగే అంశాలన్నీ ఇక్కడ మీకోసం..
ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, వాటి గురించి ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడరని, ఢిల్లీ పేలుళ్ల ప్రస్తావనే లేదని, ఢిల్లీ అయినా పహల్గాం అయినా ప్రజలను రక్షించే పరిస్థితిలో మనం లేమని గౌరవ్ గొగోయ్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ముస్లింలీగ్కు దాసోహం అనడం, వందేమాతర గీతాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించడం దురదృష్టకరమని ప్రధాని అన్నారు. జిన్నా నిరసనకు దిగడంతో సుభాష్ చంద్రబోస్కు నెహ్రూ లేఖ రాశారని, గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అందులో పేర్కొన్నారని, గీతాన్ని సమీక్షించాలని కోరారని వివరించారు.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిపోయినా ఇంకా లార్డ్ అనే పదం స్కూలు పుస్తకాలు, అధికారిక వెబ్సైట్లల్లో కనిపిస్తుండటంపై బీజేపీ ఎంపీ సుజిత్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఆవరణలోకి కుక్కలు రాకూడదనే నిషేధం ఏదీ లేదని, అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఒకసారి ఎద్దులబండిపై వచ్చారని రేణుకాచౌదరి గుర్తుచేశారు.
సంచర్ సాథీ యాప్తో వ్యక్తిగత జీవాతాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదనుకుంటే యాప్ను డిలీట్ చేయవచ్చని, యాక్టివేట్ చేసుకోకుంటే సరిపోతుందని అన్నారు.
మూడో రోజు పార్లమెంట్ సమావేశాల లైవ్ అప్డేట్స్
'సంచార్ సాథీ' అంశం ఇవాళ పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. ఈ యాప్ తీసుకురావడం ప్రజల ప్రైవసీని కేంద్రం హరించడమేనని విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై చర్చకు వ్యతిరేకం కాదని అధికార పక్షం వివరణ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షాలు శాంతించడం లేదు.
అఖిలపక్ష సమావేశానంతరం మీడియాతో కాంగ్రెస్ విప్ కె.సురేష్ మాట్లాడుతూ, ఎస్ఆర్ఐ అంశంపై చర్చించాలని విపక్షాలు కోరాయని, ఎస్ఐఆర్ను కూడా జతచేసి ఎన్నికల సంస్కరణలపై విస్తృత చర్చకు సమావేశం నిర్ణయించిందని తెలిపారు.