Home » Palla Srinivasa Rao
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు, వైసీపీ నేతలకు హిందువులన్నా, హిందూ మతమన్నా గౌరవం లేదని.. ఆలయాలపై దాడి జరిగినా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్‌నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతలు.. వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపీ సీనియర్ నేతలు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దిశానిర్దేశం చేశారు. ఏపీలో అలజడులు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని.. ఆ ట్రాప్‌లో పడొద్దని తెలుగుదేశం నేతలకు సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని పల్లా శ్రీనివాస రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రానికి తండ్రిలాగా ఉన్నారన్నారు.
గీతం విద్యా సంస్థల భూముల క్రమబద్ధీకరణపై జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దారుణమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో లేనటువంటి కల్చర్‌ని తీసుకొస్తూ చాలా దారుణంగా ప్రవర్తించడాన్ని పౌర సమాజం కూడా ఖండిస్తోందని అన్నారు..
విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే ఎన్డీయే కూటమి వల్లనే అని పల్లా శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు గురించి చెడుగా మాట్లాడటం మంచిది కాదని మండిపడ్డారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .