Home » Palla Srinivasa Rao
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఏపీ వ్యాప్తంగా ఈరోజు చేపట్టామని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో రేషన్ కార్డుపై ఆ నాయకుడు బొమ్మలు వేసుకున్నారని ధ్వజమెత్తారు.
అనంతపురం అర్బన్ పంచాయతీపై తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ హై కమాండ్ చర్చించింది. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ వద్ద అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హాజరై వివరణ ఇచ్చారు.
జగన్ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు. నరకానికి ఎవరు వెళ్తారో జగన్‌కే తెలుస్తోందని విమర్శించారు. కల్తీ మందు అమ్మి ప్రజలు ప్రాణాలను బలిగొన్న జగన్ నరకానికి వెళ్తారని ఆక్షేపించారు. ఇప్పటికైనా జగన్ తన బుద్ధి మార్చుకోవాలని పల్లా శ్రీనివాస్ రావు హితవు పలికారు.
గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంగా పడి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.
పల్లా సింహాచలం సేవలు మరువలేనివని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు.
తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన స్థానిక రాజేంద్రనగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Palla Simhachalam: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.
ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య అజెండాగా అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం రూపకల్పన చేయబడింది. తిరుమల నగర్లో పలు సమస్యలు పరిష్కరించగా, మిగిలిన వాటిపై కూడా కృషి కొనసాగుతోందని తెలిపారు.
TDP Mahanadu 2025: కడప జిల్లాలో మే27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.