Home » New Delhi
దేశంలోని వివిధ కాలేజీలు, యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష సీయూఈటీ యూజీ వ్యవస్థ లోపభూయిష్ఠంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి.
ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా ఆగస్టు 13, 14 తేదీల్లో పార్లమెంటు సమావేశాలు ఉండవు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకూ ఉంటాయని ఇంతకుముందు ప్రకటించారు.
ఇంతవరకూ 28 రాష్ట్రాల్లో బీజేపీ అంతర్గత సంస్థాగత ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు కనీసం 19 రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల ఎన్నిక తప్పనిసరి.
నిందితులపై తగినన్ని సాక్ష్యాధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వరాదని ఢిల్లీ పోలీసులు విచారణ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వసనీయ పత్రాలు, మెటీరియల్ ఉన్నందున 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద శిక్షార్హులని కోర్టుకు విన్నవించారు.
మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1.07 లక్షల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఇది మ్యాన్యుఫ్యాక్చరింగ్-డ్రైవెన్ ఎకానమీకి కీలక గ్రోత్ ఇంజన్ అని గత బడ్జెట్లో వైష్ణవ్ ప్రకటించారు.
ఈ వాహనాలకు ఇవాళ్టి నుంచి పెట్రోల్ బంద్ చేసేసింది సర్కారు. రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభాన్ని ఆరంభిస్తూ 2026 ఏప్రిల్ 1 నుంచి గృహాల గణన ఉంటుందని ఆ లేఖలో మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలిపారు. దీనికి ముందు పర్యవేక్షకులు, ఎన్యూమరెటర్ల నియామకం జరుగుతుందన్నారు.
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డాటా రికార్డర్‌తో ఉన్న బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి మురళీధర్ మోహోల్ ధ్రువీకరించారు. అది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధీనంలో ఉందని తెలిపారు.
యుగంధర్‌కు ముప్పు ఉందనే నివేదిక ఆధారంగా ఆయనకు రక్షణ కల్పించాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో ఏఏఐబీ చీఫ్ దేశంలో జరిపే పర్యటనల్లో ఆయన వెంట ముగ్గురు నుంచి నలుగురు సీఆర్పీపీ సిబ్బంది ఉంటారు.
సాకిబ్ అబ్దుల్ హమీద్ నాచన్ శనివారంనాడు న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. మెదడులో నరాలు చిట్లడంతో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు.