Share News

Jagdeep Dhankhar: అధికారిక నివాసం నుంచి ఫామ్‌హౌస్‌కు మారిన జగదీప్ ధన్‌ఖడ్

ABN , Publish Date - Sep 01 , 2025 | 08:28 PM

గత జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేసారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Jagdeep Dhankhar: అధికారిక నివాసం నుంచి ఫామ్‌హౌస్‌కు మారిన జగదీప్ ధన్‌ఖడ్
Jagdeep Dhankar

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి కొద్ది వారాల క్రితం రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) సోమవారంనాడు ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అక్కడి నుంచి దక్షిణ ఢిల్లీ ఛతర్‌పూర్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేటు ఫామ్‌హౌస్‌కు మారారు. ఈ ఫామ్‌హౌస్‌ ప్రముఖ జాట్ నేత, ఇండియన్ నేషనల్ లోక్‌ దళ్ (INLD) అభయ్ చౌతాలాకు చెందినదిగా తెలుస్తోంది.


మాజీ ఉపరాష్ట్రపతులకు టైప్-VIII అధికారిక నివాసం కేటాయిస్తుంటారు. అది కేటాయించేంత వరకూ తాత్కాలికంగా చౌతాలా ఫామ్‌హౌస్‌లో ధన్‌ఖడ్ ఉంటారు. గత జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేసారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొనడంతో వెంటనే ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.


కాగా, జగదీప్ వారసుడు ఎవరనేది సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తేలనుంది. అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని పోటీకి దింపింది.


ఇవి కూడా చదవండి..

ముంబై వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి.. హైకోర్టు హుకుం

అప్ఘనిస్తాన్‌ను ఆదుకుంటాం.. మోదీ అభయం

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2025 | 08:30 PM