Home » Nepal
నేపాల్‌లో వరదల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక వివరాలను వెల్లడించింది. రసువా ప్రాంతంలోని ఓ జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి నలుగురు భారతీయులను నేపాల్ ఆర్మీ రక్షించి కాఠ్మండుకు తరలించింది.
నేపాల్‌లో భారీ వరదల మధ్య మరో షాకింగ్ క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.త్రిశూలీ నదిలో కొట్టుకువచ్చిన ఓ బ్యాంక్ సేఫ్ లాకర్‌ను కొందరు స్థానికులు తెరిచి అందులోని డబ్బును తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదృష్టానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఓ కుటుంబానికి సంబంధించిన వీడియోలు రెండు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు ‘నిజంగా అదృష్టం అంటే వీళ్లదే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది అనాథలుగా మారిపోయారు. విపత్తు జరిగి.. రెండు రోజులు గడిచినప్పటికీ ఇంకా అక్కడి పరిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ బాలుడు చేసిన సాహసం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
నేపాల్‌ను వరద ముప్పు మరోసారి భయపెడుతోంది. నాలుగు రోజుల కిందట సంభవించిన భారీ ఆకస్మిక వరదల విషాదం నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం పొంచి ఉందని చైనా హెచ్చరించింది.
నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ విలయంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు.
నేపాల్ వరదల్లో గల్లంతైన సుహాసిని రెడ్డి కందిమల్ల సేఫ్‌గా ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు 580 మంది మృతిచెందగా, సుమారు 2,500 మంది గల్లంతయ్యారు. ఇదే సమయంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులు చనిపోయారని భావించి గుండెలు పగిలేలా రోదించింది. రోజుల తర్వాత వారిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది.
నేపాల్‌లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి ఆచూకీ గల్లంతైంది. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్‌కు వెళ్లినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది.
నేపాల్‌లో వరదల నుంచి కోలుకోక ముందే మరో షాకింగ్ విషయం వెలుగు వచ్చింది. ప్రమాదానికి కారణమైన భోటే కోషి-త్రిశూలి నదీ వ్యవస్థ సమీపంలోనే మరో రెండు హిమానీనద సరస్సులు ఏర్పడ్డాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి కృష్ణ వాట్సా తెలిపారు.