PM Modi congratulates Nepal PM: నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కికి మోదీ అభినందనలు..
ABN , Publish Date - Sep 13 , 2025 | 10:07 AM
నేపాల్‌లో కల్లోల పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
నేపాల్‌లో కల్లోల పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా సుశీలా కార్కీకి అభినందనలు తెలియజేశారు.
'నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుశీలా కార్కీకి అభినందనలు. పొరుగుదేశంంలోని ప్రజల శాంతి, పురోగతికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది' అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
కిర్క్ హత్య.. పోలీసుల కస్టడీలో అనుమానితుడు
సుచిర్ బాలాజీది హత్యే.. ఓపెన్‌ఏఐ సీఈఓకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఎలాన్ మస్క్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి