Home » Nellore
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడు అటవీ ప్రాంతంలో ఓ వృద్ధురాలు తప్పిపోయింది. దారి తప్పిపోయిన ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదు అయ్యాయి.
నెల్లూరును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూ.11 కోట్ల 75 లక్షలతో రోడ్ల పనులు చేపట్టామని మంత్రి నారాయణ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.
నెల్లూరులో భార్యను అతికిరాతకంగా హత్య చేశాడో భర్త. శ్రీహరి అనే వ్యక్తి తన భార్య శ్రీనందినిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు.
నెల్లూరు జిల్లాలో అత్యంత అరుదైన, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న వన్యప్రాణి అక్రమ రవాణా గుట్టును అధికారులు రట్టు చేశారు. కోట్లాది రూపాయల విలువైన అలుగును విక్రయించేందుకు ప్రయత్నించిన ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..
నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరికుంటపాడు మండలం బోనిగర్లపాడులో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ పూర్తయింది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా.. సుప్రీం ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది.
ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్ (పశ్చిమబెంగాల్) మధ్య నేటి నుంచి రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
మాజీ సీఎంలు కేసీఆర్, జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2020లో తెలంగాణ ఫిర్యాదుతో రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే విధించిందని తెలిపారు.