ఘోర విషాదం.. ఇద్దరు యువకుల సజీవ దహనం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:13 PM
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరికుంటపాడు మండలం బోనిగర్లపాడులో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.
నెల్లూరు, జనవరి 25: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడులో ఇద్దరు యువకులు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మేకల గణేశ్ (18), తలపల రమేశ్ (18) అనే యువకులు బోనిగర్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఓ పని నిమిత్తం స్వగ్రామం నుంచే వేరే ప్రాంతానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో కంది పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ వీరికి తాకింది.
దీంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోగా.. యువకులిద్దరూ సజీవ దహనమయ్యారు. దీంతో బోనిగర్లపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్..
నాంపల్లి అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం