Home » National News
భారీ వర్షాల కారణంగా తూత్తుకుడి, తంజావూరులో గోడ కూలి ఇద్దరు మరణించారని, మైలాడుతురైలో విద్యుదాఘాతంతో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడని మంతి రామచంద్రన్ చెప్పారు.
ప్రస్తుతం ఎస్ఐఆర్ రెండో దశ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో జరుగుతోంది.
ముంబైలో అర్ధరాత్రి ఓ మహిళపై అత్యాచారయత్నం జరిగింది. డ్రగ్స్ సేవించిన వ్యక్తి.. సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు వచ్చి.. ఆమెను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా మరికొందరిపై ఢిల్లీ ఈవోడబ్ల్యూ కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో ఎఫ్‌ఐఆర్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరో ఆరుగురి పేర్లు నమోదు చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాలు ఏ స్థాయిలో పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక సార్లు రుజువు కాగా.. తాజాగా బిహార్ లో మరోసారి నిరూపితమైంది. ఆ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 935 పోస్టులకు 9.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
వాట్సాప్, టెలిగ్రామ్ తదితర మెసేజింగ్ యాప్‌లను స్కామ్‌స్టర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టేందుకు టెలికం శాఖ కొత్త ఆదేశాలను జారీ చేసింది.
కర్ణాటక రాజకీయాల్లో కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరూ ఒకచోట సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
వీధి కుక్కల బెడదపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శనివారం 50 వేలకు మందికి పైగా పౌరులు సుప్రీంకోర్టుకు లేఖలు రాశారు.
చల్లచల్లని శీతాకాలంలో అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
ఎయిర్‌బస్ ఏ320 రకం విమానాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంలో తీవ్ర అలజడి సృష్టించాయి.