Home » National News
బాలీవుడ్ ప్రముఖులకు ముంబై ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నటి రకుల్ ప్రీత్ సింగ్, ఆమె మామ, సినీ నిర్మాత వాషు భగ్నానీ సహా పనోరమా స్టూడియోస్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో మంచు కురవడం అప్పుడే మొదలైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో ఈ సీజన్‌లో తొలిసారిగా మంచు కురిసింది.
బిహార్‌లో మహిళలపై నేరాల ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాల నేపథ్యంలో సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
చలికాలంలో ఢిల్లీని వాయుకాలుష్యం వణికిస్తుంటుంది. ప్రతి ఏటా చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ఈ ఏడాది వాయు కాలుష్యాన్ని నివారించే ముందస్తు చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను ఢిల్లీ మంత్రి పర్వేశ్ శర్మ చెంపదెబ్బ కొట్టడంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల మధ్య ప్రశ్నిస్తే, చెంపదెబ్బ కొడుతున్నారని, పేపర్ లీకుల గురించి మాట్లాడితే లాఠీచార్జి చేయిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాలపై ఎక్స్‌లో ఆయన మండిపడ్డారు.
గ్యాంగ్‌స్టర్ సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 22 మంది నిందితుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని రోడ్డు విస్తరణ ప్రాజెక్టు కోసం షాహి మసీదులో కొంత భాగాన్ని కూల్చివేయాలని ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. కార్పొరేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక వర్గానికి చెందిన వ్యక్తులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇతరులకు మార్గదర్శకాలు ఇచ్చే ముందు మనం అద్దంలో చూసుకోవాలని జస్టిస్ జోయ్ మల్యా బాగ్చీ పవర్ ఫుల్ కామెంట్స్ చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో దిగువ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
FCRA బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. రెండోసారి భేటీలో పలు అంశాలపై ఈ కమిటీ చర్చించనుంది.