మోదీ మలేసియా పర్యటన ఖరారు
ABN , Publish Date - Feb 04 , 2026 | 08:21 PM
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా మలేసియా ప్రధానితో సమావేశమై ఇరుదేశాల మధ్య సహకారంతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. మలేసియాలోని ఎన్ఆర్ఐలను కలుసుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇండియా-మలేసియా సీఈఓ ఫోరం సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల అధికారిక పర్యటనకు మలేసియా వెళ్తున్నారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 7,8 తేదీలో మలేసియాలో పర్యటించనున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ (MEA) బుధవారంనాడు తెలిపింది. మలేసియాలో మోదీ పర్యటించనుండటం ఇది మూడోసారి. అయితే 2024 ఆగస్టులో ఇరుదేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలను కుదుర్చుకున్న తరువాత మలేసియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన లక్ష్యంగా మోదీ పర్యటన ఉంటుందని ఎంఈఏ తెలిపింది.
ప్రధాని తన పర్యటనలో భాగంగా మలేసియా ప్రధానితో సమావేశమై ఇరుదేశాల మధ్య సహకారంతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. మలేసియాలోని ప్రవాస భారతీయులను కలుసుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య ప్రతినిధులతో సమావేశమవుతారు. ఇండియా-మలేసియా సీఈఓ ఫోరం సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు.
కాగా, చరిత్ర, నాగరికత, సాంస్కృతిక సంబంధాల పరంగా భారత్-మలేసియా మధ్య సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. మలేసియాలో 29 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ప్రపంచంలో ప్రవాస భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాల్లో మలేసియా మూడవది. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, తీరప్రాంత సహకారం, డిజిటల్- ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఇంధనం, హెల్త్‌కేర్, విద్యం, సంస్కృతి, పర్యాటక, ప్రజా సంబంధాల పరంగా భారత్-మలేసియా మధ్య విస్తృత సహకారం ఉందని, ఈ రంగాల్లో ప్రగతిని ఇరుదేశాల ప్రధానులు సమీక్షించనున్నారని ఎంఈఏ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మణిపూర్ సీఎంగా ఖేమ్‌చంద్ ప్రమాణ స్వీకారం..
మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా